గుంటూరులో టీడీపీ మద్దతుదారులకు వేధింపులు.. ఇళ్లకు వెళ్లేదారిలో అడ్డంగా గోడ నిర్మాణం!
- ఫిరంగిపురం మండలం పొనుగుపాడులో ఘటన
- పోలీసులను ఆశ్రయించిన టీడీపీ సానుభూతిపరులు
- గోడ నిర్మాణం ఆపేయాలని పోలీసుల ఆదేశం
తమ ఇళ్లకు వెళ్లే రహదారిపై అడ్డంగా రోడ్డును నిర్మిస్తూ దారి లేకుండా చేస్తున్నారనీ, మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలని ఫిరంగిపురం పోలీసులను కోరారు. దీంతో స్పందించిన పోలీసులు వైసీపీ నేతలు, మద్దతుదారులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి మాట్లాడారు. గోడ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. పోలీసుల ఆదేశంతో పొనుగుపాడులో గోడ నిర్మాణాన్ని వైసీపీ నేతలు ఆపేశారు.