ఆలోచనలో పడిన దిల్ రాజు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆలోచనలో పడిన దిల్ రాజు

  • చైతూ తాజా చిత్రంగా 'వెంకీమామ'
  • తదుపరి చిత్రం శేఖర్ కమ్ములతో
  • నాయికగా తెరపైకి సాయిపల్లవి పేరు 
కాంబినేషన్స్ ను సెట్ చేసుకుని పక్కా ప్లానింగ్ తో సెట్స్ పైకి వెళ్లడం దిల్ రాజుకి అలవాటు. అలా ఆయన నాగచైతన్య హీరోగా కొత్త దర్శకుడు శశితో ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అనుకున్నారు. ప్రస్తుతం చైతూ 'వెంకీమామ' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కాగానే తన సినిమాను మొదలుపెట్టాలని దిల్ రాజు భావించాడు. అయితే చైతూ మాత్రం తాజాగా శేఖర్ కమ్ములకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

'వెంకీమామ' తరువాత ఆయన శేఖర్ కమ్ముల సినిమానే చేయాలనే నిర్ణయానికి వచ్చేశాడట. దాంతో దిల్ రాజు ఆలోచనలో పడినట్టుగా చెప్పుకుంటున్నారు. చైతూ కోసం కొత్త దర్శకుడు శశిని వెయిట్ చేయించాలా? లేదంటే మరో హీరోతో ముందుకు వెళ్లాలా? అనే ఆలోచనతో ఆయన సతమతమవుతున్నట్టుగా సమాచారం. ఈ సినిమాలో చైతూ సరసన నాయికగా సాయిపల్లవి నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
dil raju

More Telugu News