9 నెలల బాలికపై అత్యాచారం.. ప్రాణాలు కోల్పోయిన చిన్నారి!
- హన్మకొండలోని కుమార్ పల్లిలో ఘటన
- తల్లిదండ్రులతో నిద్రిస్తుండగా ఎత్తుకెళ్లిన దుండగుడు
- చిన్నారి స్పృహ కోల్పోవడంతో పరారీ
అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా చిన్నారి స్పృహ తప్పడంతో చనిపోయిందని అనుకుని అక్కడి నుంచి పరార్ అయ్యాడు. బాలిక కనిపించకపోవడంతో ఈ ప్రాంతమంతా గాలించిన కుటుంబ సభ్యులు, బంధువులు బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్నారు. పోస్కో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, ఒక్కగానొక్క కుమార్తె చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.