కోహ్లీ సేన పాకిస్థాన్‌ను భయపెట్టింది: పాక్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్
- కోహ్లీ సేనపై పాక్ మాజీ కెప్టెన్ ప్రశంసల వర్షం
- భారత జట్టు సమష్టిగా ఆడుతుంది
- పాక్ ఏ ఒక్కిరిపైనో ఆధారపడుతోంది.
గత కొన్నేళ్లుగా భారత్-పాక్ జట్ల మధ్య చాలా తేడా వచ్చిందని, ఆదివారం మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో అది కనిపించిందని వకార్ వివరించాడు. ఏ ఒక్క బౌలర్ పైనో, బ్యాట్స్‌మన్ పైనో పాక్ జట్టు ఆధారపడుతుందని, అదే సమయంలో భారత్ జట్టు సమష్టిగా ఆడుతోందని కితాబిచ్చాడు. భారత జట్టులో ఎవరి పాత్ర ఏమిటనేది ఆటగాళ్లకు తెలుసని అన్నాడు. బ్రహ్మాండంగా ఆడుతోందని, ప్రస్తుత జట్టు పాకిస్థాన్‌ను భయపెట్టిందని యూనిస్ పేర్కొన్నాడు.