sharwanand: రెండు నెలలపాటు షూటింగులకు దూరంగా శర్వానంద్

  • '96' మూవీ రీమేక్ లో ప్రమాదం
  •  శర్వానంద్ భుజానికి గాయం 
  • రెండు నెలల పాటు విశ్రాంతి అవసరమన్న వైద్యులు 
ప్రస్తుతం శర్వానంద్ రెండు సినిమాలు చేస్తున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఆయన చేస్తోన్న 'రణరంగం' చివరిదశకు చేరుకుంది. ఇక దిల్ రాజు నిర్మాణంలో '96' రీమేక్ షూటింగు ఇటీవలే మొదలైంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా షూటింగు 'థాయ్ లాండ్'లో జరిగింది.

అక్కడ శర్వానంద్ స్కై డైవింగ్ కి సంబంధించిన సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా, లాండింగ్ సమయంలో తలెత్తిన సమస్య వలన ఆయన భుజానికి బలమైన గాయమైంది. దాంతో షూటింగును వాయిదా వేసేసి ఆయనను హైదరాబాద్ తీసుకొచ్చారు. రీసెంట్ గా ఆపరేషన్ ను పూర్తిచేశారు. రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారట. అందువలన శర్వానంద్ చేస్తోన్న రెండు సినిమాల విషయంలో ఆలస్యం జరగనుంది.
sharwanand

More Telugu News