Nara Lokesh: అసెంబ్లీ లాబీలో ఎదురుపడ్డ నారా లోకేశ్, ఆర్కే!

  • ఎన్నికల తర్వాత తొలిసారి పలకరించుకున్న ప్రత్యర్థులు
  • ఎన్నికల్లో గెలిచిన ఆర్కేకు లోకేశ్ శుభాకాంక్షలు
  • ధన్యవాదాలు తెలిపిన ఆర్కే
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సమావేశాలకు హాజరయ్యేందుకు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్, మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) వచ్చారు. అసెంబ్లీ లాబీలో ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా మంగళగిరి నుంచి గెలుపొందిన ఆర్కేకు లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.

దీనికి ప్రతిస్పందించిన ఆర్కే... లోకేశ్ కు ధన్యవాదాలు తెలిపారు. గత ఎన్నికల్లో పోటీ పడ్డ ప్రత్యర్థులిద్దరూ ఒకరినొకరు పలకరించుకోవడం ఇదే మొదటిసారి. మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి వీరిద్దరూ పోటీ పడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో లోకేశ్ పై 5,200 ఓట్ల తేడాతో ఆర్కే గెలుపొందారు. ఎమ్మెల్సీగా ఉన్న లోకేశ్ అదే పదవిలో కొనసాగుతున్నారు.
Nara Lokesh
rk
Telugudesam
ysrcp

More Telugu News