2024లో 25కు 25 లోక్ సభ సీట్లను కొల్లగొడతాం!: విజయసాయిరెడ్డి ధీమా
- వైసీపీ తరఫున 22 మంది గెలిచారు
- ఇది సీఎం జగన్ ఘనవిజయానికి నిదర్శనం
- ఏపీలో జగన్ అవినీతి రహిత పాలన అందిస్తున్నారు
ఏపీ ప్రజలకు సీఎం జగన్ అవినీతిరహిత పాలన అందిస్తున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రజారంజక పాలన అందించేలా జగన్ నిర్ణయాలు ఉండబోతున్నాయని అన్నారు. జగన్ ఆలోచనలకు అనుగుణంగా పార్లమెంటులో వైసీపీ సభ్యులు పనిచేస్తారని పేర్కొన్నారు.