Andhra Pradesh: నాన్నా..ఎప్పటికీ మీరే నాకు ఆదర్శం: నారా లోకేశ్

  • మీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం
  • ఓటమిని గెలుపుగా మార్చుకుని కొనసాగే నాయకుడు
  • మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను
తన తండ్రి నారా చంద్రబాబునాయుడిపై టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా లోకేశ్ ఓ ట్వీట్ చేశారు. చంద్రబాబుకు కొడుకుగా పుట్టడం తన అదృష్టమంటూ సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయాలు, ప్రజా సేవ ప్రతి రంగంలో తన తండ్రి నుంచి ఎంతో నేర్చుకున్నానని, ప్రతి ఓటమిని గెలుపు వైపు అడుగుగా మార్చుకుని కొనసాగే నాయకుడిగా, ఎప్పటికీ తన తండ్రే తనకు ఆదర్శమని అన్నారు.
Andhra Pradesh
Telugudesam
Chandrababu
nara lokesh

More Telugu News