Jagan: జగన్ ది ఉడుకురక్తం... స్పీడు మంచిదే కానీ...!: రాపాక వరప్రసాద్
- రాష్ట్రం ఆర్థిక సమస్యల్లో ఉంది
- ఆర్థిక స్థితిని జగన్ దృష్టిలో పెట్టుకోవాలి
- అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లాలి
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఏపీ సీఎం జగన్ పై వ్యాఖ్యలు చేశారు. జగన్ లో విపరీతమైన దూకుడు కనిపిస్తోందని, కానీ అదే వేగంతో రాష్ట్ర ఆర్థిక స్థితిని కూడా పరుగులు తీయించాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం ఆర్థికంగా సమస్యల్లో ఉందని, అంతంతమాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని ఆకళింపు చేసుకుని తగిన సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్లాలని రాపాక సూచించారు. తాను ప్రకటించిన పథకాలకు నిధులు ఏ విధంగా సమకూర్చుకోవాలో కూడా జగన్ ఆలోచించుకోవాలని అన్నారు.
"జగన్ ది చాలా చిన్నవయసు. 46 సంవత్సరాలకే సీఎం అయ్యారు. ఉడుకురక్తం కాబట్టి చాలా స్పీడుగా పరిగెడుతున్నాడు. మంచిదేకానీ, అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా అదే ఊపుతో ముందుకు తీసుకెళ్లగలగాలి. అలాంటప్పుడే ప్రజలు ఆయన్ని గుర్తిస్తారు. శాశ్వతంగా రాజకీయాల్లో నిలిచే అవకాశం ఉంటుంది" అంటూ తన అభిప్రాయాలు వెల్లడించారు.