Telangana: తెలంగాణలో ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు చేపడతాం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

  • దేవాలయాల లీజ్ భూములపై దృష్టి సారిస్తాం
  • ఆలయాల్లో ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు  
  • అందుకు, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాం
తెలంగాణలోని ఆలయాల్లో ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు చేపట్టాలని చూస్తున్నామని, అందుకు, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. దేవాదాయ శాఖపై ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. అలాగే, వసతి గృహాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తామని అన్నారు. ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు చేపడతామని, దేవాలయాల లీజ్ భూములపై దృష్టి సారిస్తామని చెప్పారు.
Telangana
Temples
minister
Indrakaran reddy

More Telugu News