పశ్చిమబెంగాల్ కు ఎవరు వచ్చినా బెంగాలీలోనే మాట్లాడాలి!: సీఎం మమతా బెనర్జీ
- నేను బిహార్, పంజాబ్ కు వెళితే అక్కడి భాషనే మాట్లాడతా
- బెంగాల్ లో నేరస్తులను రోడ్లపై తిరగనివ్వను
- కోల్ కతాలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్య
తాను బిహార్ లేదా పంజాబ్ కు వెళితే అక్కడి వారు మాట్లాడే భాషనే మాట్లాడుతానని చెప్పారు. ఒకవేళ ఎవరైనా బెంగాల్ వస్తే బెంగాలీలోనే మాట్లాడాలని సూచించారు. బెంగాలీని అన్నివిధాలుగా ప్రోత్సహించాలని మమత అభిప్రాయపడ్డారు. పశ్చిమబెంగాల్ లో రోడ్లపై తిరుగుతూ అలజడులు సృష్టించే నేరస్తులను వదిలిపెట్టబోమని మమతా బెనర్జీ హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ లోని 42 లోక్ సభ స్థానాలకు గానూ మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 22 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 18 సీట్లతో, కాంగ్రెస్ ఒక్క సీటుతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.