Andhra Pradesh: చాలామంది టీడీపీ నేతలు మాతో టచ్ లో ఉన్నారు!: బీజేపీ నేత సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

  • చంద్రబాబు బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు
  • జగన్ ఏపీకి ప్రత్యేక హోదాను కోరారు
  • ఏపీ ప్రజల ఆకాంక్ష అదే అయితే కేంద్రం తప్పక పరిశీలిస్తుంది
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు గత ఐదేళ్ల కాలంలో బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆ పార్టీ నేత సోము వీర్రాజు విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ కేంద్రాన్ని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా కోరారని గుర్తుచేశారు. అందులో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు. ఏపీ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదానే అయితే, దాన్ని కేంద్రం పరిశీలిస్తుందని చెప్పారు.

ఇప్పటికే తమతో చాలామంది టీడీపీ నేతలు టచ్ లో ఉన్నారని సోము వీర్రాజు బాంబు పేల్చారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.3,700 కోట్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే ఏపీకి మరో రూ.10,000  కోట్లు యుద్ధప్రాతిపదికన విడుదల చేసేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. భారత్ అన్ని రాష్ట్రాల సముదాయమనీ, కేంద్రం అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూస్తుందని స్పష్టం చేశారు.
Andhra Pradesh
Telugudesam
Chandrababu
YSRCP
Jagan
Chief Minister
BJP
somu veerraju

More Telugu News