jagan: సాయంత్రం అమిత్ షాతో భేటీ కానున్న జగన్

  • ఢిల్లీకి బయల్దేరిన జగన్
  • రేపు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు
  • అనంతరం వైసీపీ పార్లమెంటరీ పార్టీతో భేటీ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ విజయవాడ నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఈ సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కానున్నారు. రేపు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరవుతారు. పార్లమెంటు సమావేశాల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై తమ ఎంపీలతో చర్చిస్తారు. పార్లమెంటులో లేవనెత్తాల్సిన ఏపీ సమస్యలు, సభలో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేస్తారు.
jagan
delhi

More Telugu News