Tollywood: నందమూరి భార్గవ్ పుట్టినరోజు నేడు.. భావోద్వేగంతో స్పందించిన ఎన్టీఆర్!

  • భార్గవ్ కు అప్పుడే ఏడాది వచ్చేసింది
  • ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు పోస్ట్ చేసిన హీరో
  • రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ లో బిజీగా ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో తారక్ ఇన్ స్టా గ్రామ్ లో స్పందించాడు. భార్గవ్ కు అప్పుడే ఏడాది వయసు వచ్చేసిందని వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా భార్గవ్ తో దిగిన ఫొటోలను ఎన్టీఆర్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో పలువురు అభిమానులు భార్గవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా, ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నారు. 2020 జూలై 30న ఈ సినిమా విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. 
Tollywood
nandamuri
bhargav
Instagram
ntr

More Telugu News