kishan reddy: కిషన్‌ రెడ్డీ, నిన్ను చంపేస్తాం: కేంద్రమంత్రికి బెదిరింపు కాల్స్

  • ఇంటర్నెట్‌ వాయిస్ కాల్స్ ద్వారా బెదిరింపులు
  • సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ మంత్రి
  • ఆయన ఇంటివద్ద భద్రత పెంచిన పోలీసులు
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గంగాపురం కిషన్‌ రెడ్డిని చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారు. ఇంటర్నెట్‌ వాయిస్‌ కాల్స్‌ ద్వారా అజ్ఞాత వ్యక్తులు ఈ బెదిరింపులకు పాల్పడుతుండడంతో మంత్రి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు ఎక్కడి నుంచి ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయన్న దానిపై నిఘా పెట్టారు. అదే సమయంలో కిషన్‌రెడ్డి ఇంటివద్ద భద్రతా బలగాల సంఖ్యను పెంచారు. నిఘా పటిష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందిన కిషన్‌ రెడ్డికి మోదీ మంత్రివర్గంలో చోటు దక్కిన విషయం తెలిసిందే.
kishan reddy
phone calls
secundrabad
saibar crime

More Telugu News