చత్తిస్గఢ్లో ఎన్కౌంటర్...ఇద్దరు మావోయిస్టుల మృతి
- ముర్నార్ అటవీ ప్రాంతంలో ఘటన
- భద్రతా బలగాల కూంబింగ్ సందర్భంగా కాల్పులు
- ఘటనా స్థలి నుంచి తుపాకులు స్వాధీనం
అనంతరం భద్రతా బలగాలు ఘటనా స్థలిని పరిశీలించగా ఇద్దరు మావోయిస్టులు చనిపోవడం గుర్తించారు. అలాగే, వారికి సమీపంలో రెండు ఎస్ఎల్ఆర్లు, 303, 315 తుపాకులు పడి వుండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని తూర్పుగోదావరి సరిహద్దులోనూ పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎవరూ చనిపోకపోయినా పెద్ద సంఖ్యలో తుపాకులు, ఆరు కిట్ బ్యాగులు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.