Botsa Satyanarayana: ఇకపై రాజ్యాంగం ప్రకారమే సభ నడుస్తుంది: బొత్స

  • పార్టీ ఫిరాయింపులపై రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తాం
  • బలహీన వర్గాలకు సీఎం గౌరవం ఇచ్చారు
  • స్పీకర్ కు స్వేచ్ఛనివ్వడం అభినందనీయం
ఏపీ నూతన అసెంబ్లీ సమావేశాలు ఇవాళ వాడీవేడీ వాతావరణంలో జరిగాయి. సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య జరిగిన మాటల యుద్ధం, ఇతర సభ్యుల మధ్య వాగ్యుద్ధాలు రాబోయే రోజుల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఎలాంటి వాతావరణం ఉండనుందో చెప్పకనే చెప్పాయి!  ఈ నేపథ్యంలో, మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఇకమీదట రాజ్యాంగం ప్రకారమే శాసనసభ నడుస్తుందని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై తాము రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. బలహీన వర్గాలకు సీఎం గౌరవం ఇచ్చారని, స్పీకర్ కు స్వేచ్ఛ ఇవ్వడం అభినందనీయం అని తెలిపారు.
Botsa Satyanarayana
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News