యాభై శాతం నష్టాలు తెచ్చిపెట్టిన 'ఎన్జీకే'
- క్రితం నెల 31న వచ్చిన 'ఎన్జీకే'
- తెలుగులో ఫ్లాప్ టాక్
- తమిళంలోను అదే పరిస్థితి
రెండు తెలుగు రాష్ట్రాలకి కలిపి 9 కోట్లకి ఈ సినిమా థియేట్రికల్ హక్కులను అమ్మారు. ఇంతవరకూ మొత్తం ఈ సినిమా 4.5 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో యాభై శాతం నష్టాలతో బాక్సాఫీస్ రన్ క్లోజ్ చేశారు. ఇక తెలుగులో పరిస్థితి ఇలా వుంటే, తమిళంలోను ఈ సినిమా పరాజయంపాలైనట్టు సూర్య స్వయంగా చెప్పేయడం విశేషం. ప్రస్తుతం సూర్య తన తదుపరి సినిమాపై దృష్టిపెట్టారు.