Andhra Pradesh: ఇదే అచ్చెన్నాయుడు జగన్ ను ‘నువ్వు మగాడివైతే’ అన్నారు.. వీటికి సమాధానం ఏది అధ్యక్షా?: బుగ్గన రాజేంద్రనాథ్

  • టీడీపీ నేతలు ప్రజా సేవకులని చెప్పుకుంటుంటారు
  • అదే క్రమంలో చెవిరెడ్డి కూడా బంట్రోతు అని ఉండొచ్చు
  • ఏపీ అసెంబ్లీలో మాట్లాడిన వైసీపీ నేత
టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిని బంట్రోతు అని చెవిరెడ్డి భాస్కరరెడ్డి పిలవడంపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో చెవిరెడ్డి క్షమాపణలు చెప్పాలని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు సభలో డిమాండ్ చేశారు. తాజాగా చెవిరెడ్డి వ్యాఖ్యలపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించారు. టీడీపీ నేతలు సాధారణంగా తమనుతాము ప్రజా సైనికులు అనీ, సేవకులు అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే బంట్రోతులాగా అని చెవిరెడ్డి అని ఉండొచ్చు అధ్యక్షా. కాకపోతే గత ఐదేళ్ల కాలంలో టీడీపీ నేతలు మాట్లాడిన మాటలు వినాలి అధ్యక్షా.

ఒకరేమో పూడ్చిపెడతాం అంటాడు. ఇంకొకరు ఏమో పాతిపెడతాం అంటారు. చివరికి అచ్చెన్నాయుడు అయితే అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ను పట్టుకుని ‘నువ్వు మగాడివైతే’ అని దుర్భాషలాడారు. మరి ఈ మాటలకు సమాధానం లేదా అధ్యక్షా? ఈరోజు చాలా పద్ధతిగా, చాలా సిస్టమేటిక్ ఉన్నట్లు మాట్లాడుతున్నారు. నిజంగా మీరు అలాగే ఉంటుంటే న్యాయంగా అనిపించేది. సేవకులు, సైనికులు అని చెప్పుకుని టీడీపీ నేతలు తిరుగుతుంటారు కాబట్టి చెవిరెడ్డి ఓ మాట అని ఉండొచ్చు. దానికే ఈ చిన్న మాటను పట్టుకుని గొడవ చేస్తారా? టీడీపీ నుంచి ప్రతీఒక్కరూ గతంలో ఇష్టానుసారం మాట్లాడారు. ఆ రికార్డులను ఓసారి బయటకు తీయాలి’’ అని బుగ్గన డిమాండ్ చేశారు.
Andhra Pradesh
assembly session
Telugudesam
YSRCP
buggana
chevireddy
achenaidu

More Telugu News