Andhra Pradesh: చంద్రబాబు క్షమాపణలు చెప్పకుండా అనవసర విషయాలు మాట్లాడుతున్నారు!: సీఎం జగన్ ఆగ్రహం

  • గతంలో హత్యలు జరిగాయి కాబట్టి ఇప్పుడూ చేస్తామంటున్నారు
  • చంద్రబాబు వ్యవహారశైలి ఇలాగే ఉందన్న వైఎస్ జగన్
  • స్పీకర్ అనుమతిస్తే చంద్రబాబుపై ఎన్టీఆర్ వీడియో చూపిస్తా
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా పార్టీ ఫిరాయించారని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీవ్రంగా మండిపడ్డారు. గతంలో హత్యలు జరిగాయి కాబట్టి నేనూ హత్యలు చేస్తా.. అది తప్పు కాదు అన్నట్లుగా చంద్రబాబు వ్యవహారశైలి ఉందని ఎద్దేవా చేశారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ కు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం జగన్ మాట్లాడారు.

తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ ఫిరాయించిన  వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారని జగన్ గుర్తుచేశారు. ఇప్పుడు ఆ తప్పును ఒప్పుకుని క్షమాపణలు చెప్పకుండా అనవసర విషయాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటలు వింటుంటే ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. స్పీకర్ అనుమతిస్తే చంద్రబాబు గురించి ఆయనకు సొంత కూతురిని ఇచ్చిన ఎన్టీఆర్ చెప్పిన విషయాలను సభలో టీవీలో చూపిస్తామని జగన్ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ను కోరారు.
Andhra Pradesh
Jagan
Chandrababu
angry
assembly session

More Telugu News