Dasari: కనిపించకుండా పోయిన దాసరి నారాయణరావు కుమారుడు

  • ఇంటినుంచి బయటికి వెళ్లి తిరిగిరాని వైనం
  • 2008లోనూ ఇలాగే మిస్సింగ్
  • భార్యతో వివాదాలు!
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు పెద్ద కొడుకు దాసరి ప్రభు అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. దాసరి ప్రభు ఈ నెల 9న ఇంటినుంచి బయటికి వెళ్లారు. అప్పటినుంచి ఆయన తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా, దాసరి ప్రభుకు, భార్య సుశీలకు గతంలో అనేక వివాదాలున్నాయి. ఆస్తి వివాదం నేపథ్యంలో 2008లో కూడా ఓసారి ఇలాగే కనిపించకుండాపోయారు. ఆపై అనూహ్యంగా తెరపైకి వచ్చి తన భార్య సుశీలే తనను కిడ్నాప్ చేయించిందని ఆరోపించారు. దాసరి ప్రభు, సుశీల ప్రేమ వివాహం చేసుకున్నారు. తాజాగా, ఆయన అదృశ్యం వెనుక కుటుంబపరమైన కారణాలు ఉండొచ్చని భావిస్తున్నారు.
Dasari
Hyderabad
Tollywood

More Telugu News