నాటింగ్ హామ్ ను వదలని వరుణుడు... నేడు న్యూజిలాండ్ తో మ్యాచ్ డౌటే!
- నేడు న్యూజిలాండ్ తో భారత్ మ్యాచ్
- ఉదయం నుంచి కురుస్తూనే ఉన్న వర్షం
- కాస్తంత ఆలస్యంగానైనా మ్యాచ్ జరగాలని కోరుకుంటుున్న అభిమానులు
నాటింగ్ హామ్ నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం, వర్షం తగ్గే అవకాశం కూడా ఉంది. దీంతో నేటి మ్యాచ్ కాస్తంత ఆలస్యంగానైనా ప్రారంభమవుతుందన్న ఆశతో అభిమానులు ఉన్నారు. కాగా, ఇప్పటికే మూడు మ్యాచ్ లాడిన న్యూజిలాండ్ మూడు విజయాలతో ఆరు పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, ఇండియా రెండు మ్యాచ్ లాడి, రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో ఉంది.