ఆన్ లైన్ లావాదేవీల ఛార్జీల ఎత్తివేతపై ఆర్బీఐ ఆదేశాలు!
- ఖాతాదారులకు శుభవార్త చెప్పిన రిజర్వు బ్యాంకు
- ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీలపై రుసుము ఎత్తివేత
- జూలై 1 నుంచే అమల్లోకి
నిజానికి ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా జరిగే లావాదేవీలకు ఆర్బీఐ ఇప్పటి వరకు కనీస రుసుము వసూలు చేస్తోంది. దీంతో ఆ భారాన్ని బ్యాంకులు తమపై వేసుకోకుండా ఖాతాదారుల నుంచి వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు వీటిని రిజర్వు బ్యాంకు ఎత్తివేడయంతో ఖాతాదారులపై భారం తగ్గనుంది.
జూలై 1 నుంచి ఖాతాదారుల నుంచి ఈ రుసుములు వసూలు చేయవద్దని అన్ని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, నగదు చలామణి తగ్గించడం, ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత వంటి వాటి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిజర్వు బ్యాంకు తెలిపింది.