Aarthi: కారులోంచి భార్యను తోసేసిన భర్త, అత్తమామలు!

  • పోలీసులను ఆశ్రయించిన ఆర్తి
  • భర్త, అత్తమామలపై ఫిర్యాదు
  • కొన్ని రోజులుగా వేధిస్తున్నారని ఆరోపణ 
  కారులోంచి భర్త, అత్తమామలు కలసి కోడల్ని తోసేసి వెళ్లిపోయారు. తమిళనాడులో జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డ్ అవడంతో బాగా వైరల్ అవుతోంది. ఓ వీధిలో నుంచి వెళుతున్న కారులో నుంచి అకస్మాత్తుగా ఆర్తి అనే మహిళను భర్త, అత్తమామలు కిందకు తోసేశారు. దీంతో గాయాలపాలైన ఆర్తి పోలీసులను ఆశ్రయించింది.

అత్తింటి వారు కొన్నాళ్లుగా తనను వేధింపులకు గురి చేస్తున్నారని, భర్త అరుణ్‌జో సహా అత్తమామలు తనను చంపేందుకే కారులో నుంచి తోసేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆర్తి అత్తింటి వారు పరారీలో ఉండటంతో పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Aarthi
Arunjo
Tamilnadu
Car
Police
Case Failed

More Telugu News