Rithika: తండ్రి ట్రాక్టర్ కిందే పడి ప్రాణాలు కోల్పోయిన మూడేళ్ల చిన్నారి

  • రితికకు ఇంటి ముందు అన్నం తినిపిస్తున్న తల్లి
  • అన్నం అయిపోవడంతో తల్లి లోపలకి వెళ్లింది
  • తండ్రి ట్రాక్టర్‌ తీస్తుండటంతో అటుగా వెళ్లిన రితిక
తండ్రి నడుపుతున్న ట్రాక్టర్ కిందే పడి ఆయన ముద్దుల కూతురు మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో పడేసింది. కరీంనగర్ మండలం చెర్లబూత్కర్ గ్రామంలో జక్కు ప్రసాద్‌ దంపతుల కూతరు రితిక(3) తండ్రి ట్రాక్టర్ కిందే పడి ప్రాణాలు విడిచింది. నేడు రితికను తల్లి ఇంటి ముందు ఆడిస్తూ అన్నం తినిపిస్తోంది.

గిన్నెలోని అన్నం పూర్తవడంతో మరికొంత తీసుకొచ్చేందుకు తల్లి లోపలకు వెళ్లింది. అదే సమయంలో ప్రసాద్ ట్రాక్టర్‌ను వెనక్కి తీస్తుండటాన్ని గమనించిన రితిక అటు వైపు వెళ్లి ట్రాక్టర్ కింద పడిపోయింది. పాప అరుపులు విన్న వెంటనే ప్రసాద్ ట్రాక్టర్‌ను ఆపి హుటాహుటిన చిన్నారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది.
Rithika
Tractor
Prasad
Karimnagar
Hospital
Dead

More Telugu News