పార్వతీపురాన్ని ప్రత్యేక జిల్లా చేయాలంటూ ఆదివాసీల ఆందోళన!
- ఏపీలో 25 జిల్లాలు చేస్తామన్న జగన్
- నేడు విజయనగరంలో ఉద్యమించిన ప్రజాసంఘాలు
- ఇంకా తుదినిర్ణయం తీసుకోని ఏపీ సీఎం
ఈ నేపథ్యంలో పార్వతీపురం డివిజన్ ను ఆదివాసీ జిల్లాగా చేయాలని ప్రజాసంఘాలు, ఆదివాసీలు ఈరోజు ఆందోళనకు దిగారు. విజయనగరంలోని రాయగఢ్ రోడ్డు నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా వీరు డిమాండ్ చేశారు. వెంటనే పార్వతీపురం డివిజన్ ను ఆదివాసీ జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు.