janasena: అధికారం సాధించే దిశలో పవన్ కల్యాణ్ విజయం సాధించలేకపోయారు: రావెల కిశోర్ బాబు

  • పవన్ కల్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు గొప్పవే
  • సమసమాజ నిర్మాణం పవన్ ఆశయం
  • అధికారంలో లేకుండా ఎన్ని మాటలు చెప్పినా వృథానే 
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఆ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన రావెల కిశోర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో నిన్న ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన రావెల కిశోర్ బాబు ఈరోజు గుంటూరుకు వచ్చారు. ఈ సందర్భంగా తనను పలకరించిన మీడియాతో రావెల మాట్లాడారు.

టీడీపీని వీడి జనసేనలో చేరిన అతి తక్కువ సమయంలోనే ఆ పార్టీ నుంచి బయటకు రావడానికి గల కారణాలపై రావెలను ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ, పవన్ కల్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు, సమాజంలో మార్పు తీసుకురావాలన్న తపన చాలా గొప్పవని అన్నారు. అవినీతి రహిత పరిపాలన, సమసమాజ నిర్మాణం పవన్ ఆశయమని, ఈ ఆశయం నెరవేరాలంటే అధికారాన్ని అందుకోవాలని, అధికారంలో లేకుండా ఎన్ని మాటలు చెప్పినా అవన్నీ వృథానే అని అన్నారు. అధికారం సాధించే దిశలో పవన్ కల్యాణ్ విజయం సాధించలేకపోయారని అభిప్రాయపడ్డారు. 
janasena
Pawan Kalyan
bjp
Ravela Kishore Babu

More Telugu News