Balakrishna: బాలా మామయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు: నారా లోకేశ్

  • నేడు బాలకృష్ణ 59వ పుట్టినరోజు
  • హైదరాబాద్ లో వైభవంగా వేడుకలు
  • ట్విట్టర్ లో లోకేశ్ శుభాభినందనలు
నేడు హిందూపురం శాసనసభ్యుడు, నటుడు నందమూరి బాలకృష్ణ 59వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ కు వచ్చిన ఆయన, అక్కడ భారీ కేక్ ను కట్ చేసి, ఆసుపత్రి సిబ్బంది, చిన్నారులతో వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ అల్లుడు, మాజీ మంత్రి నారా లోకేశ్, ట్విట్టర్ వేదికగా తన మామకు పుట్టినరోజు శుభాభినందనలు తెలిపారు. "తన నటచతురతతో కోట్లాది ప్రజల అభిమానం సంపాదించిన కళాకారుడిగా,  నిరంతరం ప్రజా సంక్షేమమే పరమావధిగా, ప్రజలకోసం పనిచేస్తున్న మా బాలా మావయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు" అని అన్నారు. 
Balakrishna
Nara Lokesh
Birthday

More Telugu News