sharwanand: ప్రభుదేవా సోదరుడి దర్శకత్వంలో శర్వానంద్?

  • శర్వా చేతిలో రెండు సినిమాలు
  •  త్వరలో రానున్న 'రణరంగం'
  • సెట్స్ పై '96' మూవీ రీమేక్  
ప్రస్తుతం శర్వానంద్ రెండు సినిమాలు చేస్తున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఆయన 'రణరంగం' చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. ఇక '96' తమిళ మూవీ రీమేక్ లోను ఆయన చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగులో ఆయన బిజీగా వున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ప్రభుదేవా సోదరుడు .. ప్రముఖ కొరియోగ్రఫర్ రాజు సుందరం దర్శకత్వంలో ఒక సినిమా చేసే ఛాన్స్ కనిపిస్తోందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

ఇటీవలే రాజు సుందరం .. శర్వానంద్ ను కలిసి ఒక కథను చెప్పాడట. కథ బాగుందని చెప్పిన శర్వానంద్, పూర్తి స్క్రిప్ట్ తో వస్తే తనకి క్లారిటీ వస్తుందని అన్నట్టుగా సమాచారం. దాంతో రాజు సుందరం ప్రస్తుతం అదే పనిలో వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. శర్వానంద్ ను రాజు సుందరం ఎంతవరకూ ఒప్పిస్తాడో చూడాలి మరి. 
sharwanand

More Telugu News