ఆధార్ కార్డుంటే రూ. 2 లక్షల రుణమివ్వండి: ప్రధానికి వేదాంత అధినేత అనిల్ అగర్వాల్ సూచన!
- ప్రజల సగం ఆదాయం దిగుమతులపై ఖర్చు
- రుణమిస్తే, ప్రభుత్వ రంగ సంస్థల్లో అభివృద్ధి వేగం
- స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని కోరిన అనిల్ అగర్వాల్
ప్రస్తుత ఇండియా పరిస్థితిని 'మదర్ ఇండియా' సినిమాతో పోల్చిన ఆయన, రైతు 100 క్వింటాళ్ల ధాన్యం పండిస్తే 80 క్వింటాళ్లను రుణమిచ్చిన వారు పట్టుకుపోయే పరిస్థితి ఉందన్నారు. ఇక్కడి ప్రజలు తమ సగం ఆదాయాన్ని దిగుమతులపై ఖర్చుచేస్తున్నారని, ఆపై వడ్డీలకు చెల్లింపులు పోగా ఏమీ మిగలడం లేదని అభిప్రాయపడ్డారు. సహజ వనరులు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉపాధి అవకాశాలను పెద్ద ఎత్తున సృష్టించవచ్చని అన్నారు.