అలాంటప్పుడు రోడ్డుపైనే అంతిమ సంస్కారాలు చేపడతాం: బెంగాల్ బీజేపీ ప్రధాన కార్యదర్శి
- అంతిమ సంస్కారాలను అడ్డుకోవడమేంటి?
- పార్టీ కార్యాలయానికి తరలించి తీరుతాం
- శాంతియుతంగా తరలిస్తామన్నా వినలేదు
ఊరేగింపులు లేకుండా, శాంతియుతంగానే మృతదేహాలను పార్టీ కార్యాలయానికి తరలిస్తామన్నా పోలీసులు వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అవరోధాలు కల్పించినా తమ పార్టీ కార్యకర్తల మృతదేహాలను పార్టీ కార్యాలయానికి తరలించి తీరుతామని రాహుల్ సిన్హా స్పష్టం చేశారు. ఒకవేళ తీసుకెళ్లనీయకుండా అడ్డుకుంటే రోడ్డుపైనే అంతిమ సంస్కారాలు చేపడతామని హెచ్చారించారు. అయితే భద్రతా బలగాలు అడ్డుకుంటున్న విషయాన్ని గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠి దృష్టికి తీసుకెళ్లగా సీనియర్ అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారని రాహుల్ సిన్హా తెలిపారు.