ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసి మృతదేహాన్ని మురుగు కాల్వలో పడేసిన దుండగులు
- దుకాణానికి వెళ్లిన బాలిక
- ఎంతకీ తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు
- స్థానిక మురుగు కాల్వలో బాలిక మృతదేహం
- ఆరుగురు పోలీసుల సస్పెండ్
అయితే ఫిర్యాదు అనంతరం బాలిక ఇంటికి వచ్చిన పోలీసులు పాప ఎవరితోనో వెళ్లిపోయి ఉంటుందని పేర్కొన్నట్టు స్థానికులు తెలపడంతో ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు పోలీసులపై సస్పెండ్ వేటు పడింది. ఈ ఘటనపై స్పందించిన మధ్యప్రదేశ్ హోంమంత్రి బాల బచ్చన్, ఈ ఘటనకు సంబంధించి బాలిక ఇంటి సమీపంలో నివాసముండే విష్ణు అనే కూలిని అనుమానిస్తున్నామని, అతడు పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామన్నారు. పలువురు స్థానికులను కూడా అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భోపాల్ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ పాప కుటుంబ సభ్యులను పరామర్శించారు.