Samantha: వారితో కలిసి తొలిరోజు ‘ఓ బేబి’ చిత్రాన్ని చూస్తా: సమంత

  • అద్భుతమైన వ్యక్తుల్ని కలిశా
  • వారి కథలు నాతోనే ఉన్నాయి
  • వారి చిన్నపిల్లల మనస్తత్వం ఆశ్చర్యమేసింది
నందినీరెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘ఓ బేబీ’. 20 ఏళ్ల అమ్మాయి అయిన సమంత శరీరంలోకి 70 ఏళ్ల వృద్ధురాలైన లక్ష్మి ప్రవేశించే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు సమాచారం. ఈ సినిమా షూటింగ్ సమయంలో నందినీరెడ్డి తనను వృద్ధాశ్రమానికి తీసుకెళ్లారని సామ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. తాను నానమ్మ, తాతయ్య లేకుండా పెరిగానని, అందుకే తనను నందినీరెడ్డి వృద్ధాశ్రమానికి తీసుకెళ్లి అక్కడి వాతావరణాన్ని చూపించారని తెలిపింది.

‘తాను వృద్ధాశ్రమంలో అద్భుతమైన వ్యక్తుల్ని కలిశానని, షూటింగ్ జరిగినన్ని రోజులు వారి కథలు తనతోనే ఉన్నాయని తెలిపింది. అక్కడి వృద్ధులలోని చిన్నపిల్లల మనస్తత్వం చూసి ఆశ్చర్యపోయానని తెలిపింది. వారి స్వభావాన్ని తన మైండ్‌లో పెట్టుకునే ‘బేబక్కా’ పాత్రను చేశానని సామ్ తెలిపింది. ‘ఓ బేబీ’ సినిమాను తొలిరోజు వారితో కలిసి చూస్తానని వెల్లడించింది. ఓ బేబీ’ ఒక ఎమోషనల్ చిత్రమని, అది జూలై 5న విడుదల కాబోతోందని సమంత పేర్కొంది.
Samantha
Nandini Reddy
O Baby
Old Age Home
Lakshmi
Instagram

More Telugu News