Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ వ్యక్తిగత కార్యదర్శి శీతల్ జైన్ మృతి

  • 35 ఏళ్లుగా అమితాబ్ వద్ద పనిచేస్తున్న జైన్
  • జైన్ వయసు 77 ఏళ్లు
  • అంత్యక్రియలకు హాజరైన అమితాబ్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అత్యంత ఆత్మీయుడ్ని కోల్పోయారు.  అమితాబ్ వద్ద గత 35 ఏళ్లుగా వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న శీతల్ జైన్ మృతి చెందారు. శీతల్ జైన్ వయసు 77 సంవత్సరాలు. జైన్ అమితాబ్ కు పీఏ మాత్రమే కాకుండా ఆయనతో ఓ చిత్రం కూడా నిర్మించారు. అమితాబ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'బడేమియా చోటేమియా' అనే చిత్రానికి ఆయనే నిర్మాత. జైన్ అంత్యక్రియలు ముంబయి విలేపార్లేలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో నిర్వహించారు. జైన్ అంత్యక్రియలకు అమితాబ్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు.
Amitabh Bachchan

More Telugu News