ప్రియాంక మోహన్ కి పెరుగుతోన్న క్రేజ్

  • షూటింగు దశలో 'గ్యాంగ్ లీడర్'
  • నాని సరసన ప్రియాంక మోహన్
  • యువ కథానాయకులలో ఆసక్తి
తెలుగులోని యువ కథానాయకుల్లో కొంతమంది తమ తాజా చిత్రంలో ఒక కథానాయికను తీసుకోమని దర్శక నిర్మాతలకి సూచన చేస్తున్నారట. అంతగా యువ హీరోల దృష్టిని ఆకర్షించిన ఆ హీరోయిన్ పేరే 'ప్రియాంక మోహన్'. కుర్రకారు మనసులను పొలోమంటూ దోచేసేంతటి గ్లామరున్న ఈ అమ్మాయి, ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని సరసన 'గ్యాంగ్ లీడర్'లో నటిస్తోంది.

ఈ అమ్మాయి ఫొటోలను విక్రమ్ కుమార్ బయటికి వదలకపోయినా, మంచి అందగత్తె అని తెలిసి కుర్ర హీరోలు తమ జోడీగా తీసుకుందామనే ఆసక్తిని కనబరుస్తున్నారట. ఎవరికి వారుగా తమ ప్రయత్నాలను కూడా మొదలుపెట్టేశారని చెప్పుకుంటున్నారు. అయితే తన సినిమా పూర్తయ్యేంత వరకూ మరో ప్రాజెక్టును చేయడానికి వీల్లేదని విక్రమ్ కుమార్ కండిషన్ పెట్టడం వలన ఆ అమ్మాయి చేసే అవకాశం లేదు. 'గ్యాంగ్ లీడర్' విడుదలైతే ఈ సుందరిని పట్టుకోవడం కష్టమేననే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.
Go Back to Shorts
priyanka mohan

More Telugu News