కొటక్ మహీంద్రా బ్యాంకుకు భారీ పెనాల్టీ విధించిన ఆర్బీఐ
- ప్రమోటర్ల వాటాల విలీనం విషయంలో నిబంధనల ఉల్లంఘన
- బ్యాంకు సమాధానాన్ని పరిశీలించిన తర్వాత నిర్ణయం
- రూ. 2 కోట్ల పెనాల్టీ విధింపు
బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949లోని నిబంధనల ప్రకారం ఈ పెనాల్టీ విధిస్తున్నట్టు వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా ఎందుకు విధించకూడదో తెలపాలంటూ షోకాజ్ నోటీసును జారీ చేశామని... బ్యాంకు నుంచి వచ్చిన సమాధానాన్ని పరిశీలించిన తర్వాత జరిమానా విధించాలని నిర్ణయించామని తెలిపింది.