దీపికా పదుకొనే 'చపాక్' రిలీజ్ డేట్
- తెరపైకి యాసిడ్ బాధితురాలి కథ
- టైటిల్ గా 'చపాక్'
- జనవరి 10న విడుదల
ఈ సినిమాకి దీపికా పదుకొనె కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించడం విశేషం. తాజాగా దీపికా పదుకొనె ఈ సినిమాను గురించి స్పందిస్తూ, 'ఇది నా కెరియర్లో అత్యుత్తమమైన సినిమా .. జనవరి 10 .. 2020న ఈ సినిమాను చూడొచ్చు' అని చెప్పారు. దీపికా పదుకొనే అభిమానులంతా కూడా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలోని పాత్ర ఆమె కెరియర్లో చెప్పుకోదగినది అవుతుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.