Sudheer Babu: ఫిట్ నెస్ కోసం కష్టపడుతున్న సుధీర్‌బాబు

  • ‘V’ చిత్రంతో పాటు, బయోపిక్‌లో నటిస్తున్న సుధీర్‌బాబు
  • క్యారెక్టర్‌కు తగ్గట్టు శరీరాకృతిని మలచుకునే యత్నం
  • ఫిట్‌నెస్‌కు సంబంధించిన వివరాల వెల్లడి
హీరో సుధీర్ బాబు ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. పుల్లెల గోపీచంద్ బయోపిక్‌తో పాటు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘V’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల కోసం సుధీర్‌బాబు తెగ కష్టపడుతున్నాడు. క్యారెక్టర్‌కు తగ్గట్టుగా శరీరాకృతిని మలచుకునేందుకు ఎక్కువ సమయం జిమ్‌లోనే గడుపుతున్నాడు. ఆయన జిమ్ చేస్తున్న ఫొటోలను చిత్రబృందాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాయి. తన కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ ఎన్ని కిలోల బరువు పెరిగానో వివరిస్తూ తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన విశేషాలన్నింటినీ ఇన్‌స్టాగ్రాంలో సుధీర్‌బాబు పోస్ట్ చేశాడు.
Sudheer Babu
Pullela Gopichand
Indraganti
Social Media
V movie
Biopic

More Telugu News