సార్వత్రిక ఎన్నికల్లో ధన ప్రవాహం గురించి వెలుగు చూసిన కళ్లు చెదిరే వాస్తవాలు!
- ఎన్నికల ఖర్చు మొత్తం రూ.60 వేల కోట్లు
- ఖర్చులో బీజేపీదే అగ్రస్థానం
- ఒక్కో ఓటరుపై రూ.700 వ్యయం
- 1998 - 2019 మధ్య ఆరు రెట్లు పెరిగిన ఖర్చు
తాజాగా చేసిన అధ్యయనంలో ఏ పార్టీ ఎంత ఖర్చు చేసిందనే విషయాలను కూడా సీఎంఎస్ వెల్లడించింది. ఈ మొత్తం ఖర్చులో బీజేపీదే అధిక మొత్తం అని తేలింది. బీజేపీ ఎన్నికల వ్యయం 45 శాతం కాగా, కాంగ్రెస్ వాటా 40 శాతమని తేలింది. పార్టీలన్నీ కలిపి ఒక్కో ఓటరుపై రూ.700 వ్యయం చేశాయి. 1998 - 2019 మధ్య ఎన్నికల ఖర్చు ఆరు రెట్లు పెరగడం విశేషం. 1998లో రూ.9 వేల కోట్లు ఖర్చు కాగా, ప్రస్తుతం అది దాదాపు 60 వేల కోట్లకు చేరుకుంది. 1998లో ఎన్నికల ఖర్చులో బీజేపీ 20 శాతం ఖర్చు చేసింది. 2019లో అది 45 శాతానికి చేరుకుంది.