vijayashanthi: మహేశ్ మూవీలో ఫ్యాక్షన్ లీడర్ పాత్రలో విజయశాంతి

  • మహేశ్ బాబు 26వ సినిమాకి సన్నాహాలు
  •  కీలకమైన పాత్రలో విజయశాంతి
  •  మరో ముఖ్యమైన పాత్రలో జగపతిబాబు
మహేశ్ బాబు .. అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుంది. మహేశ్ బాబుకి ఇది 26వ సినిమా. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మందన నటించనుండగా, కీలకమైన పాత్రలో విజయశాంతి కనిపించనున్నారు.

దాంతో ఆమె పాత్ర ఎలా వుండనుందనే కుతూహలం అభిమానుల్లో పెరిగిపోతూ వస్తోంది. ఈ సినిమాలో ఆమె ఊరు బాగుకోసం తప్పనిసరి పరిస్థితుల్లో కత్తి పట్టిన పవర్ఫుల్ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. మరో కీలకమైన పాత్రను చేస్తోన్న జగపతిబాబుతో ఆమె పాత్ర తలపడనుందని అంటున్నారు. తన పాత్రలోని వైవిధ్యం .. తన పాత్రకి గల ప్రాధాన్యత కారణంగానే ఆమె ఈ సినిమా చేయడానికి అంగీకరించడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
vijayashanthi

More Telugu News