'మోదీ రాడార్' కామెంట్ ను ప్రస్తావిస్తూ, పాకిస్థాన్ హాట్ బాంబ్ వీణా మాలిక్ వివాదాస్పద వ్యాఖ్య!

  • ఆ విమానం కూలిపోలేదు
  • మేఘాలు అడ్డురావడంతో రాడార్లు కనిపెట్టలేకపోతున్నాయి
  • వీణామాలిక్ వ్యాఖ్యలపై మండిపడుతున్న నెటిజన్లు
బాలాకోట్ దాడులపై గతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ, పాకిస్థాన్ హాట్ బ్యూటీ వీణా మాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల క్రితం గల్లంతైన భారత వాయుసేన విమానం ఏఎన్-32ను ప్రస్తావిస్తూ, ఈ విమానం కూలిపోలేదని, వాతావరణం మేఘాలతో నిండివుండటంతో రాడార్లు గుర్తించడం లేదని ట్వీట్ చేసింది.

బాలాకోట్ దాడుల సమయంలో వాతావరణం సరిగ్గాలేని కారణంగా సరిహద్దులు దాటేందుకు అధికారులు భయపడుతుంటే తానే భరోసాను ఇచ్చానని, మేఘాలు దట్టంగా ఉంటే మనకే మంచిదని, రాడార్లకు మన విమానాలు కనిపించవని గుర్తు చేశానని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు అదే వ్యాఖ్యలను ప్రస్తావించిన వీణా, ఏఎన్-32ను రాడార్లు కనుక్కోవడం లేదని, మేఘాలు దట్టంగా ఉండటమే కారణమని ఓ స్మైలీ ఇమేజ్ ని జత చేసి ట్వీట్ చేసింది. ఈ విమానాన్ని కనుగొనేందుకు ఇస్రో శాటిలైట్లు, గూఢచర్య విమానాలు, రాడార్లు రంగంలోకి దిగిన వేళ, వీణా మాలిక్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇండియాలో డబ్బు సంపాదించుకుని, పేరు తెచ్చుకున్న ఆమె, గతాన్ని మరచిపోయిందని విమర్శలు గుప్పిస్తున్నారు.
Go Back to Shorts
Veenamalik
Pakistan
India
Radar
IAF

More Telugu News