Jagan: రాజశ్యామల అమ్మవారికి జగన్ తో ప్రత్యేక పూజలు చేయించనున్న స్వరూపానందేంద్ర

  • అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం
  • ఎన్నికల తరువాత తొలిసారి విశాఖకు జగన్
  • మరికాసేపట్లో ప్రత్యేక పూజలు
అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం తరువాత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నేడు తొలిసారిగా విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇది పూర్తి ఆధ్యాత్మిక పర్యటనగా సాగనుంది. ఈ ఉదయం 10.30కి శారదాపీఠానికి చేరుకునే జగన్ తో, అక్కడి రాజశ్యామల అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించాలని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూజల తరువాత స్వరూపానందేంద్రతో జగన్ ప్రత్యేకంగా భేటీ అవుతారు. మంత్రివర్గం కూర్పు, విస్తరణకు మంచి ముహూర్తంపై ఆయన చర్చించనున్నట్టు తెలుస్తోంది.

ఎన్నికల్లో పోటీ చేసే ముందు స్వరూపానందేంద్ర ఆశీర్వాదాన్ని జగన్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆపై అఖండ విజయాన్ని జగన్ సొంతం చేసుకున్నారు. ఈ కారణంతోనే మరోసారి స్వామి ఆశీస్సుల కోసం జగన్ వస్తుండటంతో, జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్వయంగా పీఠంలోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Jagan
Vizag
Swaroopanandendra
Sarada Peetham

More Telugu News