ntr: కొమరమ్ భీమ్ గా బ్రిటీష్ సైనికులతో పోరాడిన ఎన్టీఆర్

  • షూటింగు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
  • కొమరమ్ భీమ్ గా ఎన్టీఆర్ 
  • జూలై 30, 2020లో విడుదల  
రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోన్న సంగతి తెలిసిందే. చరణ్ .. ఎన్టీఆర్ గాయాల కారణంగా కొంతకాలంగా ఆగిపోయిన షూటింగ్, హైదరాబాద్ లో తిరిగి మొదలైంది. రీసెంట్ గా ఎన్టీఆర్ పై ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారని సమాచారం. ఈ సినిమాలో కొమరమ్ భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఆయన బ్రిటీష్ సైన్యంతో తలపడే  సన్నివేశాలను భారీ స్థాయిలో చిత్రీకరించారని అంటున్నారు.

ఈ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. చరణ్ సరసన అలియా భట్ నటిస్తున్న ఈ సినిమాలో, అజయ్ దేవగణ్ .. సముద్రఖని కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. జూలై 30 .. 2020వ సంవత్సరంలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.
ntr
charan

More Telugu News