subbaraya sharma: గుమ్మడి గారిని 'ఏరా' అనడం నా వల్ల కాలేదు: సీనియర్ నటుడు సుబ్బరాయ శర్మ

  • 'శుభలగ్నం'లో చేశాను 
  • గుమ్మడిగారు నచ్చజెప్పారు
  •  సీనియర్ ఆర్టిస్టుల మంచితనం  
రంగస్థలంపై .. బుల్లితెరపై .. వెండితెరపై నటుడిగా సుబ్బరాయ శర్మ మంచి పేరును సంపాదించుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'శుభలగ్నం' సినిమా షూటింగు సమయంలో జరిగిన ఒక సంఘటనను గురించి ప్రస్తావించారు.

'శుభలగ్నం' సినిమాలో నేను రోజా తండ్రి పాత్రలో కనిపిస్తాను. ఆ సినిమాలో గుమ్మడి గారి కాంబినేషన్లో ఒక సీన్ వుంది. నేను ఆయనతో 'ఏరా ఇప్పుడు నువ్వు దీనికి ఏం సమాధానం చెబుతావ్?' అని అడగాలి. అంతటి సీనియర్ నటుడిని పట్టుకుని 'ఏరా' అనడం నా వల్ల కాదని దర్శకుడికి చెప్పేశాను. అప్పుడు గుమ్మడి గారు కల్పించుకుని 'సుబ్బరాయ శర్మగారూ .. మీరు నా వేషాన్ని అంటున్నారు .. నన్ను కాదు. నేనేం ఫీల్ కాను .. ఫరవాలేదు .. డైలాగ్ చెప్పండి' అన్నారు. ఆనాటి సీనియర్స్ అందరిలోనూ ఆ మంచితనం ఉండేది" అని చెప్పుకొచ్చారు.
subbaraya sharma
gummadi

More Telugu News