vijaysai reddy: విజయసాయిరెడ్డి నియామకం దురదృష్టకరం: ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి

  • లేని పదవిని సృష్టించారు
  • నిబంధనలను విజయసాయిరెడ్డి తెలుసుకోవాలి
  • న్యాయపరమైన పోరాటం చేస్తాం
ఒలింపిక్ అసోసియేషన్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా లేని పదవిని సృష్టించి వైసీపీ నేత విజయసాయిరెడ్డిని ఛైర్మన్ చేశారని... ఇది చాలా దారుణమని ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కేపీ రావు అన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ నియమ నిబంధనలను తెలుసుకోవాలని విజయసాయిరెడ్డిని కోరుతున్నామని తెలిపారు. మంచి ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటానని జగన్ చెప్పారని... ఒలింపిక్ సంఘంలో జరిగే అక్రమాలను, అవకతవకలను సరిచేయాల్సిందిగా సీఎంను కోరుతున్నామని చెప్పారు. విజయసాయిరెడ్డిని ఛైర్మన్ గా నియమించడంపై న్యాయపరమైన పోరాటం చేస్తామని తెలిపారు.
vijaysai reddy
olympic ossociation
jagan
ysrcp

More Telugu News