తనకోసం వండిన ఆహారాన్ని అధికారులతో పంచుకోవడం జగన్ సంస్కారాన్ని చాటుతోంది: విజయసాయిరెడ్డి
- సమీక్షల కోసం వచ్చే అధికారుల లంచ్ జగన్ గారింట్లోనే
- ఏ విషయమైనా గంటల్లోనే తేల్చేస్తున్నారు
- జగన్ సమీక్షల పట్ల అధికారులు సంతృప్తిగా ఉన్నారు
ఇక సమీక్షల కోసం వస్తున్న అధికారుల మధ్యాహ్న భోజనం ముఖ్యమంత్రి గారి నివాసంలోనే ఏర్పాటు చేస్తున్నారని, తన కోసం వండిందే అధికారులకు కూడా పెట్టాలని జగన్ గారు సూచిస్తున్నారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఓ సీఎం అధికారులతో భోజనాన్ని పంచుకోవడం ఆయన సంస్కారానికి నిదర్శనం అని ట్వీట్ చేశారు.