అక్షయ్ కుమార్ రిక్వెస్ట్ .. తిరిగొచ్చిన లారెన్స్
- అక్షయ్ కుమార్ హీరోగా 'లక్ష్మీ బాంబ్'
- నిర్మాతల తీరుపట్ల లారెన్స్ అసహనం
- షూటింగు మొదలయ్యేలా చేసిన అక్షయ్
ఒక దర్శకుడిగా తనని గౌరవించనందున తాను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించాడు. దాంతో ఈ ప్రాజెక్టు విషయంలో అభిమానుల్లో అయోమయం నెలకొంది. దాంతో అక్షయ్ కుమార్ రంగంలోకి దిగి, లారెన్స్ ను బుజ్జగించాడట. ఆయన రిక్వెస్ట్ చేయడంతో లారెన్స్ తన పంతాన్ని పక్కకి పెట్టేశాడు. శనివారం రోజున ఈ సినిమా షూటింగు ఆయన చేతుల మీదుగానే తిరిగి మొదలైంది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ అక్షయ్ తో దిగిన ఫొటోను పోస్ట్ చేయడంతో, అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.