అందుకే టీడీపీని తరిమికొట్టారు: విజయసాయి రెడ్డి
ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకోబట్టే ప్రజలు తెలుగుదేశం పార్టీని తరిమికొట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "అధికారం అంటే దోచుకోవడం, దాచుకోవడమేనని పచ్చ పార్టీ వాళ్లు అనుకున్నారు. అందుకే ప్రజలు వారిని తరిమి కొట్టారు. మనం మాత్రం దీన్నొక పవిత్ర బాధ్యతగా భావించాలి. ప్రజలిచ్చిన అఖండ మెజారిటీ వారికి సేవ చేసేందుకు మాత్రమే అని అర్థం చేసుకోవాలి. జగన్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి" అని అన్నారు.