Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కూచిపూడి వారి వీధి' అంటూ అభిమానుల సందడి... అంతా ఉత్తిదే అని కొట్టిపారేసిన హీరో నాని

  • జెర్సీ తర్వాత రెండు సినిమాల్లో నటిస్తున్న నాని
  • మరో కొత్త చిత్రం అంటూ ఫ్యాన్స్ ఊహాగానాలు
  • ట్విట్టర్ లో స్పందించిన యువ హీరో
టాలీవుడ్ యువ హీరో నాని తాజాగా నటిస్తున్న సినిమా ఇదేనంటూ సోషల్ మీడియాలో సరికొత్త ప్రచారం మొదలైంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నాని నటిస్తున్నాడంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. దీనికి 'కూచిపూడి వారి వీధి' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారని కన్ఫామ్ చేసేశారు.

అయితే, దీనిపై హీరో నాని వెంటనే స్పందించారు. తన కొత్త సినిమాపై ప్రచారం జరుగుతున్న దాంట్లో నిజంలేదని స్పష్టం చేశారు. 'అది నిజం కాదు మై బాయ్స్' అంటూ ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు. జెర్సీ చిత్రం ఘనవిజయం సాధించిన తర్వాత నాని 'గ్యాంగ్ లీడర్', 'వి' చిత్రాల్లో నటిస్తున్నారు. అంతలోనే మరో కొత్త చిత్రం అంటూ ఫ్యాన్స్ ఊహాగానాలు మొదలుపెట్టడంతో నాని స్పందించక తప్పలేదు.
Nani
Tollywood

More Telugu News