Upasana: ఫ్యాన్స్... ఇప్పటికైనా తెలిసిందా? చెర్రీ నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడో?: ఉపాసన

  • ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉప్పీ, చెర్రీ
  • సింహం పిల్లలతో ఆడుకున్న ఉపాసన
  • అంత ధైర్యం తనకుండబట్టే పెళ్లి చేసుకున్నారని వ్యాఖ్య
టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ కపుల్ రామ్ చరణ్, ఉపాసనలు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో తమ మ్యారేజ్ డే వేడుకలను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారిద్దరూ ఎంతో ఆనందిస్తూ గడుపుతూ, ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన వివరాలను ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు.

తాజాగా, రెండు సింహం పిల్లలతో ఆడుకుంటున్న ఫొటోను పోస్ట్ చేసిన ఉపాసన, దానికి ఓ ఆసక్తికరమైన క్యాప్షన్ ను పెట్టారు. "ఇప్పుడు తెలిసిందా మీకు మిస్టర్‌ సి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారో?" అని వ్యాఖ్యానించారు. ఈ ఆఫ్రికా పర్యటన తమకెన్నో పాఠాలు నేర్పింది. ప్రకృతిని, జంతువులను గౌరవించాలని చెప్పిందని, వాటిని కాపాడుకునేందుకు మనవంతు ఏదన్నా చేసే సమయం వచ్చిందని అన్నారు. చేసే చిన్న పనులే పెద్ద మార్పును తెస్తాయని చెప్పుకొచ్చారు.

మొత్తం మీద సింహం పిల్లలను పట్టుకునేంత ధైర్యం తనకు ఉన్నది కాబట్టే చరణ్‌ తనను పెళ్లి చేసుకున్నాడని ఉపాసన చెప్పినట్టుగా ఈ ఫొటో, క్యాప్షన్ ఉండటంతో ఇది వైరల్ అవుతోంది. కాగా, ఆఫ్రికా పర్యటన నుంచి వచ్చిన తరువాత చెర్రీ తిరిగి 'ఆర్‌ఆర్ఆర్' షూటింగ్ లో పాల్గొననున్నారు.
Upasana
Ramcharan
Cubs
South Afrika

More Telugu News